A Pivotal Moment

ఒక కీలకమైన క్షణం

స్వచ్ఛమైన పరివర్తన యొక్క శాశ్వతమైన క్షణం

మే 5, 1970న, ముంబైకి సమీపంలో, భారతదేశం యొక్క పశ్చిమసముద్రతీరాన ఉన్న పట్టణం నార్గోల్‌లో, మెదడులోని లింబిక్ ప్రాంతం యొక్క శక్తి కేంద్రమైన సహస్రారాన్ని తెరవడం అనేది చాలా ముఖ్యమైన సంఘటన.

ఈ సంఘటన యొక్క ప్రాముఖ్యతను అతిగా చెప్పలేము. శ్రీ మాతాజీ గారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అనుసరించిన ప్రతిదీ, ఆ సంఘటన నుండి ఉద్భవించింది. ఒక ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణ లేదా అందమైన కళాకృతి వలె, ఈ అపూర్వమైన పురోగతి సంవత్సరాలుగా ప్రతిధ్వనించింది, ఆమె పని మరియు దృక్పథంతో పరిచయం ఉన్న వారందరినీ ప్రభావితం చేస్తూవచ్చింది.

శ్రీ మాతాజీ గారు కనుగొన్నది విశిష్టమైనది. సహస్రారాన్ని తెరవడం అనేది స్వచ్ఛమైన పరివర్తన యొక్క క్షణం, మరియు ఇది మానవులకు వారి పరిమితులను దాటి చేరుకోవడానికి మరియు గొప్ప వాటితో కలియక అవ్వడానికి ఒక పద్ధతిని అందిస్తుంది. ఈ సందర్భం మరియు అవగాహనా కోసం శ్రీ మాతాజీ గారు వేచి చూసారు.

"నేను మార్గాలు మరియు పద్ధతులను వెతుకుతున్నాను," అని ఆమె వివిరించారు, "నేను అన్ని ప్రస్తారణలు మరియు కలయికలను పని చేస్తాను అనే భావనలో నా స్వంత ధ్యాన శైలి ద్వారా నాలో నేను పని చేస్తున్నాను. నేను ఒక వ్యక్తిని కలిసినప్పుడు, ఆ వ్యక్తికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో, వాటిని ఎలా అధిగమించగలరో నేను చూస్తాను. నేను ఆ వ్యక్తిని అంతర్గతంగా అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తాను.

mother-ocean

మానవ సందిగ్ధతను అర్థం చేసుకోవడంలో కీలకమైన సూక్ష్మ శరీరం గురించి, ప్రాచీన జ్ఞానంలో ఉందని శ్రీ మాతాజీ గారికి తెలుసు. భౌతికానికి మించిన ఈ శరీరం నిజమైనది, మార్గాలు, శక్తి కేంద్రాలు మరియు కుండలిని అని పిలువబడే ప్రాథమిక శక్తి కూడి ఉంటుంది. విధులు మరియు నిర్మాణం శాస్త్రానికి తెలిసిన భౌతిక వ్యవస్థను మాత్రమే ప్రతిబింబిస్తాయి, కానీ సూక్ష్మ స్థాయిలో.

"నేను జరుగుతున్న అన్ని విషయాలను చూడగలిగాను," శ్రీ మాతాజీ గారు గుర్తు చేసుకున్నారు. "ఆ రోజు, ఎలాగైనా, నేను చివరి చక్రాన్ని తెరవాలని చెప్పాను."

ఈ చక్రం లేదా శక్తి కేంద్రాన్ని సంస్కృతంలో సహస్రార అని పిలుస్తారు, మెదడులోని లింబిక్ ప్రాంతంలో దాని చోటు ఉంటుంది. ఈ శక్తి కేంద్రంను తెరవడం అనేది ప్రతిదానిని చలనంలో ఉంచే ఆచరణ , ఇది సత్యానికి ప్రవేశ మార్గం .

shri-mataji-looking

"నేను ఒంటరిగా ఉన్నాను మరియు నేను చాలా బాగున్నాను. ఒక్క మాట అయినా చెప్పడానికి చుట్టుపక్కల ఎవరూ లేరు. ఆపై, ధ్యానంలో, సహస్రారం తెరవాల్సిన సమయం ఆసన్నమైందని నేను భావించాను. సహస్రారం తెరవాలని నేను కోరుకున్న సమయంలో, నేను గమనించినది ఏమిటంటే, కుండలిని నా లోపల టెలిస్కోప్(దూర వీక్షణ యంత్రం ) లాగా పైకి లేచి, ఒకదాని తర్వాత ఒకటి తెరుచుకుంటూ , పైకి ప్రయాణిస్తూ ఉంది . అది కరిగిన, ఎరుపు-వేడి ఇనుము రంగులా ఉంది."

“అప్పుడు నేను కుండలిని యొక్క బాహ్య నిర్మాణాన్ని చూశాను, అది పైకి లేచి, ప్రతి చక్రం వద్ద శబ్దాలను సృష్టిస్తోంది. కుండలిని బ్రహ్మరంధ్రాన్ని చీల్చడానికి పైకి లేచింది.”

బ్రహ్మరంధ్రము అనేది తల పైభాగంలో ఉన్న ఫాంటనెల్ ఎముక ప్రాంతం. శ్రీ మాతాజీ గారు వర్ణించిన అనుభవం స్వీయ-సాక్షాత్కారం, జ్ఞాన వికాసం మరియు చాలా మంది కోరుకునే అవగాహన. శ్రీ మాతాజీ గారు చాలా మంది కోరుకునే విధి గురించి మాట్లాడుతున్నారు, ఈ బహుమతి సాధారణంగా సంవత్సరాల అంకితభావం మరియు శ్రమతో ముడిపడి ఉంది.

“పైన ఉన్న శక్తి అకస్మాత్తుగా ప్రతి దిశ నుండి చల్లని గాలిలా నాలో ప్రవేశించిందని నేను ఆ సమయంలో అనిపించింది . నేను మొత్తం తెరిచి చూసాను మరియు కుండపోత వర్షం లాంటి గాలి నా తల గుండా ప్రవహించడం ప్రారంభించింది. నేను ఇప్పుడు కోల్పోయానని భావించాను, నేను ఇక లేను. అక్కడ ఉన్నది దయ మాత్రమే. ఇది నాకు పూర్తిగా జరగడం నేను చూశాను."

ఈ స్వీయ-సాక్షాత్కార అనుభవాన్ని, ఈ ఉన్నత జ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకోవాలని శ్రీ మాతాజీ గారికి తెలుసు.

"పని ప్రారంభించడంలో ఎటువంటి హాని లేదని నేను గ్రహించాను. గందరగోళం ముగిసింది. చివరికి సమయం ఆసన్నమైంది. భయపడాల్సిన పనిలేదు. ఈ కార్యము చేయాలిసిందే . మానవులలో సామూహిక చైతన్యాన్ని మేల్కొల్పడం కోసమే నేను ఈ లోకానికి వచ్చాను. ప్రజలు తమ స్వీయ-సాక్షాత్కారాన్ని పొందే వరకు లేదా వారి స్వంత ఆత్మను అర్థం చేసుకునే వరకు, ఈ పని అసాధ్యం అని నేను అనుకున్నాను. ఈ లోకంలో ఇంకెవరు ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు.

శ్రీ మాతాజీ గారు తమ ఆధ్యాత్మిక కార్యము ఎలా ప్రారంభమైందో వివరించారు. "నాకు బాగా తెలిసిన ఒక వృద్ధురాలిపై నేను పని చేసాను. ఆమె ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు నేను సంతృప్తి చెందాను. చాలా మంది ఇతరులు కూడా తమ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలరని నేను భావించాను. ఒక వ్యక్తికి ఆత్మ సాక్షాత్కారం ఇవ్వడం సులభం. ఒక వ్యక్తికి అవగాహన కల్పించడం చాలా సులువుగా ఉంది, కానీ జనంపై సామూహిక స్థాయిలో పని చేయడానికి, మరికొంత కృషి అవసరం.

ప్రతి ఒక్కరూ ఒకే ఆత్మ సాక్షాత్కారంతో ప్రయోజనాన్ని పొందవలసి ఉంటుంది, అయితే ఈ రకమైన కార్యాలు సామూహిక స్థాయిలో ఇంతకు ముందెన్నడూ జరగలేదు. నేను ధ్యానం ద్వారా ఇవన్నీ సాధించాను."

ఆమె పని చాలా సంవత్సరాలుగా అట్టడుగు స్థాయిలో నిశ్శబ్దంగా కొనసాగింది. “నాలో ఉన్న శక్తుల గురించి ఎవరికీ తెలియదు. నా గురించి ఎవరికీ తెలియదు మరియు నా గురించి ఎటువంటి ఆలోచన లేదు. ” శ్రీ మాతాజీ గారు చెప్పేదానికి చాలా మంది ప్రజలు సిద్ధంగా లేరు. ఆమె సందేశం, విప్లవాత్మకమైనది మరియు సాహసోపేతమైనది, చాలా మంది మానవులకు తమను తాము అర్థం చేసుకోవడానికి ఒక ప్రాథమిక సవాలు.

shri-mataji-nirmala-devi

"కానీ, ఆ మహిళలో కుండలిని మేల్కొన్నప్పుడు, ఆమెలో ఏదో ఒక సూక్ష్మ శక్తి ప్రవేశించినట్లు నేను భావించాను," అని శ్రీ మాతాజీ గారు గుర్తుచేసుకున్నారు. అప్పుడు మరో పన్నెండు మంది తమ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు. వాళ్ళ కళ్ళు మెరిసిపోవడంతో వారే ఆశ్చర్యపోయారు. వారు తమలో ప్రవేశించిన ఒక అద్వితీయమైన, సున్నితమైన శక్తీ ద్వారా ప్రతిదీ స్పష్టంగా గ్రహించడం మరియు చూడటం ప్రారంభించారు, దాని ద్వారా వారు ప్రతిదీ అనుభూతి చెందగలరు."

shri-mataji-nirmala-devi-teaching-sahaja-yoga-meditation-in-india

స్వీయ-సాక్షాత్కారం ద్వారా, ప్రజలు వారి నిజమైన స్వీయ తత్త్వం అయ్యారు. వారు ఇంతకు ముందు తెలియని వాటిని గ్రహించారు. వారు ఒకరిలో ఒకరిని చూసుకోవటం ప్రారంభించారు. దానితో, నిజమైన అనుసంధానం ప్రారంభమైంది.

"నేను ఒక విషయం ఖచ్చితంగా గ్రహించాను, ఈ పన్నెండు మంది వ్యక్తులు పన్నెండు విభిన్న స్వభావాలను కలిగి ఉన్నారని మరియు వారితో కూర్చోవడం ద్వారా, ఆత్మ కి ఉన్న కాంతి శక్తిని ఎలా ఏకీకృతం చేయాలో వారికి చెప్పాలి" అని శ్రీ మాతాజీ గారు చెప్పారు . “ఇది మనం సూది సహాయంతో పువ్వులను దారం తో ఒకే దండలోకి ఎక్కించినట్లే.. వారు తమ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినప్పుడు, వారి లోపల, ప్రతి ఒక్కరిలో, అది ఒకదాని తర్వాత ఒకటి ఒకే తీగలో కలిసిపోవడాన్ని నేను గమనించాను."

నేను ఒక మహిళతో ప్రారంభించాను. ఆ తర్వాత క్రమంగా అనేకమందికి ఆత్మ సాక్షాత్కారం లభించడం మొదలుఅయింది. క్రమంగా పని మెరుగుపడింది మరియు మనల్ని మనం మార్చుకోగల మార్గం ఇదేనని ప్రజలు కనుగొన్నారు. సహజ యోగం చాలా ముఖ్యమైనదని నిర్ధారించబడింది.