ఒక గొప్ప వారసత్వం

ఒక గొప్ప వారసత్వం

శాలివాహన రాజవంశీకులు

1923వ సంవత్సరం, వసంత కాలపు విషువత్తు రోజు ఐన మార్చి21వ తేదీన సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు, భారతదేశానికి నట్టనడి ప్రాంతమైన చింద్వారా పట్టణంలో శ్రీ నిర్మలా సాల్వే జన్మించారు. ఆమె పూర్వీకులలోని ఉత్తమ గుణాలు చిన్నప్పటి నుండే ఆమెలో అగుపించేవి.

YouTube player

ఆమె నాయనమ్మ సఖుబాయి సాల్వే గారు, శతాబ్దాలుగా ఆ కుటుంబపు రాజవంశానికి వారసత్వంగా అబ్బిన ధైర్యసాహాసాలు, సద్గుణాలను ప్రదర్శించారు.1883లో ఆమె నిండు గర్భిణీగా ఉన్నసమయంలో,ఓ విషాదకర పరిస్థితిలో తన భర్తను కోల్పోయారు. ఆమె భర్త మరియు వారి కుటుంబం క్రైస్తవులు అనే నిజాన్ని సహించలేని అతని కుటుంబ సభ్యుల బెదిరింపుల కారణంగా, ఆమె తన నలుగురు పిల్లలను తీసుకొని, ఉధృతంగా ప్రవహిస్తున్న నది వద్దకు, వర్షం కురుస్తున్న ఓ రాత్రి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళారు.

సఖుబాయికి ఎంతటి ఆత్మవిశ్వాసం ఉండేదంటే,తన శారీరక పరిస్థితి, తొమ్మిది గజాల చీర, కుండపోత వర్షం, ఉప్పొంగుతున్న నదిని సైతం లెక్కచేయకుండా, ఆమె తన పిల్లలతో కలిసి నదిని దాటింది. ఆ తర్వాత సమీపంలోని రైల్వే స్టేషన్‌కు ఎనిమిది కిలోమీటర్లు నడిచింది. 
తెల్లవారుజామున, వారు సఖుబాయి సోదరుడి స్వస్థలమైన ఉజ్జయిన్‌కు వెళ్లే రైలు ఎక్కారు. ఈ క్లిష్ట పరిస్థితులలోనే శ్రీ మాతాజీ తండ్రి అయిన ప్రసాద్ రావు సాల్వే జన్మించారు.

సఖుబాయి మరియు ఆమె పిల్లలు సంపన్న, సుఖవంతమైన జీవితం నుండి తీవ్రమైన పొదుపు జీవితానికి అలవాటు పడవలసి వచ్చింది. అయితే, సఖుబాయికి తన పిల్లల చదువు చాలా ముఖ్యం,అంతేకాక ఆమె వారిలో ఆత్మత్యాగం, అంకితభావం అనే స్ఫూర్తిని నింపింది. ఇంట్లో కిరోసిన్ లేనప్పుడు, వారు వీధి దీపాల కింద చదువుకున్నారు.

అందరికంటే చిన్నవాడైన ప్రసాద్ రావు, అత్యంత ప్రతిభావంతుడైన విద్యార్థి ఆయన విద్యా జీవితమంతా స్కాలర్‌షిప్‌లను పొందాడు.న్యాయశాస్త్రం అభ్యసించి, ఛింద్వారా నగరంలోని ఒక ప్రసిద్ధ సంస్థలో చేరాడు. 

కొద్దికాలానికే ఆయనకు వివాహం జరిగింది, కానీ దురదృష్టవశాత్తు, 37 ఏళ్ల వయసులో ఐదుగురు పిల్లలు కలిగిన తర్వాత ఆయన భార్య మరణించింది. ఆయనకు ఇష్టం లేకపోయినా,పిల్లల శ్రేయస్సు దృష్ట్యా బంధువులు అతన్ని మళ్లీ వివాహం చేసుకోమని ఒప్పించారు.

నాగ్‌పూర్‌కు చెందిన కార్నెలియా కరుణా జాదవ్ అనే ఒక యువతి ఉండేది. ఆమె భారతదేశంలో గణితశాస్త్రంలో ఆనర్స్ డిగ్రీ పొందిన మొదటి మహిళ. ఆమె సంస్కృతంలో కూడా పండితురాలు ప్రాచీన భారతీయ సంస్కృతిపై మంచి అవగాహన కలిగి ఉండేది. ఆమె అత్యంత విద్యావంతురాలు కావడం వల్ల, ఆమె తండ్రికి ఆమెకు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ విద్యా అర్హతలు ఉన్న భాగస్వామిని వెదకడం కష్టమైయింది.

ఉమ్మడి స్నేహితుల ద్వారా ప్రసాద్ రావు, కార్నెలియాకు ఆమె తండ్రికి వివాహ ప్రతిపాదన పంపారు. ఐదుగురు పిల్లలున్న ఒక వ్యక్తి యొక్క ఈ ప్రతిపాదనను అంగీకరించాలా వద్దా అనేది అంత తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు. అయినప్పటికీ, అతని తెలివితేటలకు, దైవభక్తికి ఆమె ముగ్ధురాలైంది. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన అతని పిల్లల పట్ల ఆమెకు ప్రగాఢమైన జాలి కలిగింది. వారికి 1920వ సంవత్సరం జూన్ 21న వివాహం జరిగింది.

నా పూర్వీకులు ఈ ప్రదేశాన్ని పరిపాలించారు మరియు ఇది శాలివాహనాల రాజధాని ప్రతిష్ఠాన్ అని పిలువబడింది.  తరువాత, వారు దీనిని పైఠాన్‌గా సులభతరం చేశారు. నా పూర్వీకులు, వేల సంవత్సరాలు ఈ ప్రదేశాన్ని పరిపాలించారు.

నా పూర్వీకులే ఈ శాలివాహను రాజవంశాన్ని ప్రారంభించారు. వాస్తవానికి వారు తమను తాము సాథ్వాహన్ అని పిలుచుకునే వారు అంటే ఏడు వాహనాలు (వాహనాలు) అని అర్థము. వారు ఏడు చక్రాలలోని ఏడు వాహనాలకు ప్రాతినిధ్యం వహించారు. ఇది అంత సహజ్‌గా ఉండటం ఆశ్చర్యంగా ఉంది.

ప్రసాద్ రావు గారు మరియు కార్నెలియా గారు తమ దేశం మీద, ఆధ్యాత్మిక సంప్రదాయం మరియు విలువల పట్ల గాఢమైన ప్రేమను పంచుకున్నారు. 1925లో వారు మొదటిసారిగా మహాత్మా గాంధీ గారిని కలిసినప్పుడు వారి కుమార్తె నిర్మల వయస్సు కేవలం రెండేళ్లు, ఈ సమావేశం వారిపై అపారమైన ప్రభావాన్ని చూపింది. అహింసాయుత పోరాటం ద్వారా స్వేచ్ఛా భారతదేశాన్ని ఎలా సాధించవచ్చు అని గాంధీ గారి ఆలోచనని గుర్తించారు.

ప్రసాదరావు గారికి బ్రిటీష్ వారు బిరుదు ఇచ్చినప్పటికీ, వారు క్రిస్టియన్లు (బ్రిటీష్ పాలనలో చాలా ప్రత్యేకతలు ఉండేవి) అయినప్పటికీ, అతను మరియు అతని భార్య ఉద్యమంలో పాల్గొనడానికి వెనుకాడలేదు, వారి వైఖరిని స్పష్టం చేశారు. - నాగ్‌పూర్‌లోని పబ్లిక్ స్క్వేర్‌లో వారి విదేశీ నిర్మిత దుస్తులను తగులబెట్టడం కూడా చేశారు.స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న కారణంగా, వారిద్దరూ అనేకసార్లు జైలుకెళ్లారు, మరియు వారి కోసం ఎవరూ కన్నీళ్లు పెట్టకూడదని కుటుంబంలో నియమమును కూడా విధించారు. భారతదేశం యొక్క స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైన విషయం, మరియు స్వీయ త్యాగం నియమానికి కుడా, మినహాయింపు లేదు.

 

YouTube player

ఆమె తల్లిదండ్రులు తరచూ దూరంగా ఉండటం లేదా జైలులో ఉండటంతో, శ్రీ మాతాజీ గారు ఇంటి బాధ్యతను తనపై వేసుకున్నారు, తద్వారా ఆమె పెద్ద తోబుట్టువులు తమ చదువులను నిరంతరాయంగా కొనసగించగాలిగారు. అప్పటికి ఆమె వయసు ఎనిమిదేళ్లు.

కొన్ని సంవత్సరాల తరువాత, శ్రీ మాతాజీ గారు స్వాతంత్ర్య పోరాటంలో చేరడానికి తగినంత వయస్సు కలిగి, తోటి విద్యార్థులను కుడా అదే విధంగా ప్రోత్సహించారు. ఆమె కూడా బ్రిటీష్ వారిచే జైలులో పెట్టబడి హింసించబడ్డారు. కానీ ఆ అనుభవంతో ఆమె ఆత్మ మాత్రము బలహీనపడలేదు. ఆమె జీవితాంతం, ఆమె తన గొప్ప పూర్వీకుల శాశ్వత విలువలుగా ఉన్న ధైర్యం, స్వీయ త్యాగం మరియు కరుణ వ్యక్తీకరించడం కొనసాగిస్తున్నారు.

shri-mataji-nirmala-devi-and-family

H. P. Salve, 'My Memoirs' New Delhi: Life Eternal Trust, 2000.