ఒక గొప్ప వారసత్వం
శాలివాహన వంశం వారసులు
1923లో మార్చి 21వ తేదీ వసంత సమరాత్రిన సరిగ్గా పన్నెండు గంటలకు, భారతదేశంలోని భౌగోళిక కేంద్రంలోని చింద్వారా పట్టణంలో,నిర్మలా సాల్వే జన్మించారు. నిర్మల లో చిన్నప్పటి నుంచీ ఆమె పూర్వీకుల గొప్ప గుణాలు చూడగలిగారు.
ఆమె అమ్మమ్మ గారు, సఖూబాయి సాల్వే, శతాబ్దాలుగా కుటుంబ రాజవంశంలో ఉన్న ధైర్య మరియు సద్గుణ లక్షణాలను ప్రదర్శించారు. 1883లో, సఖూబాయి గారి గర్భం చివరి దశలో ఉండగా, విషాదకర పరిస్థితుల్లో తన భర్తను కోల్పోయారు. తన భర్త బంధువులు (అతను మరియు అతని కుటుంబం క్రిస్టియన్ అనే వాస్తవాన్ని సహించలేక పోయారు) బెదిరించి, ఆమె తన నలుగురు పిల్లలను తీసుకొని, ఒక వర్షాకాలంలో ఆలస్యంగా, తడిసిన రాత్రి, ఉధృతంగా ప్రవహిస్తున్న సమీపంలోని నదికి వెళ్ళిపోయారు.
సఖూబాయి గారు మరియు ఆమె పిల్లలు, ధనవంతుల జీవితం నుండి అతి పొదుపుగా ఉండే జీవితానికి అలవాటు పడవలసి వచ్చింది. అయితే, సఖూబాయి గారికి ఆమె పిల్లల చదువు చాలా అవసరం, అందుకు ఆమె వారిలో ఆత్మత్యాగం మరియు నిబద్ధత స్ఫూర్తిని నింపారు. ఇంట్లో కిరోసిన్ లేకపోవడంతో వీధి దీపాల కింద చదువు సాగించారు.
చిన్నవాడైన ప్రసాదరావు గారు చాలా తెలివైన విద్యార్థి మరియు అతని విద్యా జీవితంలో ఎన్నో స్కాలర్షిప్లు అందుకున్నాడు. అతను న్యాయశాస్త్రం అభ్యసించి, చింద్వారా నగరంలోని ఒక ప్రసిద్ధ సంస్థలో చేరాడు.
తరువాత ఆయన వైవాహిక జీవితం లో అడుగు పెట్టి, ఐదుగురు పిల్లలకి తండ్రి అయ్యరు. కానీ దురదృష్టం వల్ల 37 సంవత్సరాల వయస్సులో భార్యని కోల్పోయారు. అయిష్టంగా ఉన్నప్పటికీ, చివరికి పిల్లల శ్రేయస్సు కోసం ఆందోళనతో అతని బంధువులు తిరిగి వివాహం చేసుకోవడానికి ఒప్పించారు.
నాగ్‌పూర్‌కు చెందిన కార్నెలియా కరుణా జాదవ్ అనే యువతి, భారతదేశంలో గణితంలో ఆనర్స్ డిగ్రీ పొందిన మొదటి మహిళ. ఆమె సంస్కృతంలో పండితురాలు మరియు ప్రాచీన భారతీయ సంస్కృతిలో బాగా ప్రావీణ్యం సంపాదించారు. ఆమె చాలా ఉన్నత విద్యావంతురాలైనందున, ఆమె తండ్రికి కనీసం సమానమైన, లేదా ఆమె కి మించిన విద్యార్హతలు ఉన్న భాగస్వామిని కనుగొనడం కష్టం అయింది.
పరస్పర స్నేహితుల ద్వారా, ప్రసాదరావు గారు, కార్నెలియా గారికి మరియు ఆమె తండ్రికి వివాహ ప్రతిపాదన పంపారు. ఐదుగురు పిల్లలు ఉన్న ప్రసాద రావు గారు పంపిన వివాహ ప్రతిపాదనను అంగీకరించాలా వద్దా అనేది సులభంగా తీసుకున్న నిర్ణయం కాదు. అయినప్పటికీ, ఆమె అతని తెలివితేటలు మరియు భగవంతుడు పై విశ్వాసం చూసి ముగ్ధురాలైంది మరియు చిన్న వయస్సులోనే తల్లిలేని అతని పిల్లల పట్ల ఆమెకు లోతైన కరుణ కలిగింది. వారు జూన్ 21, 1920 న వివాహం చేసుకున్నారు.
నా పూర్వీకులే ఈ శాలివాహను రాజవంశాన్ని ప్రారంభించారు. వాస్తవానికి వారు తమను తాము సాథ్వాహన్ అని పిలుచుకునే వారు అంటే ఏడు వాహనాలు (వాహనాలు) అని అర్థము. వారు ఏడు చక్రాలలోని ఏడు వాహనాలకు ప్రాతినిధ్యం వహించారు. ఇది అంత సహజ్‌గా ఉండటం ఆశ్చర్యంగా ఉంది.
ప్రసాద్ రావు గారు మరియు కార్నెలియా గారు తమ దేశం మీద, ఆధ్యాత్మిక సంప్రదాయం మరియు విలువల పట్ల గాఢమైన ప్రేమను పంచుకున్నారు. 1925లో వారు మొదటిసారిగా మహాత్మా గాంధీ గారిని కలిసినప్పుడు వారి కుమార్తె నిర్మల వయస్సు కేవలం రెండేళ్లు, ఈ సమావేశం వారిపై అపారమైన ప్రభావాన్ని చూపింది. అహింసాయుత పోరాటం ద్వారా స్వేచ్ఛా భారతదేశాన్ని ఎలా సాధించవచ్చు అని గాంధీ గారి ఆలోచనని గుర్తించారు.
ప్రసాదరావు గారికి బ్రిటీష్ వారు బిరుదు ఇచ్చినప్పటికీ, వారు క్రిస్టియన్లు (బ్రిటీష్ పాలనలో చాలా ప్రత్యేకతలు ఉండేవి) అయినప్పటికీ, అతను మరియు అతని భార్య ఉద్యమంలో పాల్గొనడానికి వెనుకాడలేదు, వారి వైఖరిని స్పష్టం చేశారు. - నాగ్‌పూర్‌లోని పబ్లిక్ స్క్వేర్‌లో వారి విదేశీ నిర్మిత దుస్తులను తగులబెట్టడం కూడా చేశారు.స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న కారణంగా, వారిద్దరూ అనేకసార్లు జైలుకెళ్లారు, మరియు వారి కోసం ఎవరూ కన్నీళ్లు పెట్టకూడదని కుటుంబంలో నియమమును కూడా విధించారు. భారతదేశం యొక్క స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైన విషయం, మరియు స్వీయ త్యాగం నియమానికి కుడా, మినహాయింపు లేదు.
ఆమె తల్లిదండ్రులు తరచూ దూరంగా ఉండటం లేదా జైలులో ఉండటంతో, శ్రీ మాతాజీ గారు ఇంటి బాధ్యతను తనపై వేసుకున్నారు, తద్వారా ఆమె పెద్ద తోబుట్టువులు తమ చదువులను నిరంతరాయంగా కొనసగించగాలిగారు. అప్పటికి ఆమె వయసు ఎనిమిదేళ్లు.
కొన్ని సంవత్సరాల తరువాత, శ్రీ మాతాజీ గారు స్వాతంత్ర్య పోరాటంలో చేరడానికి తగినంత వయస్సు కలిగి, తోటి విద్యార్థులను కుడా అదే విధంగా ప్రోత్సహించారు. ఆమె కూడా బ్రిటీష్ వారిచే జైలులో పెట్టబడి హింసించబడ్డారు. కానీ ఆ అనుభవంతో ఆమె ఆత్మ మాత్రము బలహీనపడలేదు. ఆమె జీవితాంతం, ఆమె తన గొప్ప పూర్వీకుల శాశ్వత విలువలుగా ఉన్న ధైర్యం, స్వీయ త్యాగం మరియు కరుణ వ్యక్తీకరించడం కొనసాగిస్తున్నారు.